పత్రికా స్వాతంత్య్రం పై అనుమానం


ప్రజాస్వామ్యంలో పత్రికా స్వాతంత్య్రం, పాత్రికేయుల పాత్రపై చాలాసార్లు మాట్లాడుతుం టామని, అయితే పత్రికా రంగం కార్పొరేట్‌ చేతుల్లోకి పోయిన నేటి పరిస్థితుల్లో పత్రికా స్వాతంత్య్రం ఏ మేరకు ఉందనే అనుమానం కలుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు రాసిన ‘బులేనా’ వ్యంగ్య వ్యాఖ్యల పుస్తకాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా స్వాతంత్య్ర మన్నది అంతర్జాలానికి మాత్రమే ఉందనిపిస్తోందన్నారు. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఒక నాడు వ్యంగ్య చిత్రకారులు ఆలూరి సత్యం స్వేచ్ఛగా కార్టూన్లు వేయగా, పొత్తూరి ప్రచురించారని చెప్పారు. నేడు ఫిరాయింపులపై కార్టూన్లు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తాను రచనలు చేయడానికి కార్టూనిస్టు సత్యం దోహదపడినట్లు వెల్లడించారు. సీనియర్‌ పాత్రికేయులు శ్రీరమణ పుస్తక పరిచయం చేశారు.

ముఖ్యాంశాలు