లీడింగ్ గ్లోబల్ పవర్ ఇండియా


భారతదేశాన్ని లీడింగ్ గ్లోబల్ పవర్ గా గుర్తిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇప్పటికే అమెరికా ఇండియాను ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ఇచ్చి గౌరవించిన సంగతి విదితమే. అమెరికా తాజాగా విడుదల చేసిన “నేషనల్ సెక్యురిటీ స్ట్రాటజీ (NSS)" నివేదికలో ఈ విషయం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన 62 పేజీల నివేదికలో భారతదేశానికి అమెరికా అధిక ప్రాధాన్యత నివ్వనునట్టు పేర్కొంది. అంతే కాకుండా భారత్ తొ మరిన్ని ప్యూహాత్మక సంబందాలను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నట్టు తెలియజేసింది. చైనాకు వ్యతిరేకంగా తెరపైకి తెచ్చిన ఇండొఫసిఫిక్ రీజియన్ లొ భారత్ సహా జపాన్, ఆస్ట్రేలియాలతొ చతుర్బుజ సహకారాన్ని వ్యూహాత్మకంగా మరింత పెంపొందించుకుంటామని తెలిపింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులొని భారత భూభాగం మీదుగా చైనా నిర్మిస్తున్న కారిడార్ లను దృష్టిలో ఉంచుకొని అమెరికా చేసిన కొని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దక్షిణాసియా దేశాలకు మరే దేశం నుండి ఆపద వచ్చినా సహాయ, సహకారాలు అందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని అమెరికా చెప్పడం గమనార్హం. తీవ్రవాదానికి ప్రోత్సాహం విషయంలో పాకిస్థాన్ పై ఇక నుండి ఒత్తిడి మరింత పెంచాలని అమెరికా భావిస్తోంది. అప్పటికీ మారకుండా ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం కొనసాగుతుంటే పాకిస్థాన్ ను మరే దేశం పూనుకున్నా కాపాడలేదని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా విడుదల చేసిన ఈ కొత్త “నేషనల్ సెక్యురిటీ స్ట్రాటజీ” నివేదిక భారత్ కు అనుకూలంగా ఉండడంతో పాటు చైనా, పాక్ లకు ఇబ్బందిగా పరిణమించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం