ఎయిర్ ఫోర్స్ లో చేరనున్న తేజస్ విమానాలు


స్వదేశీ యుద్ధ విమానాలు తేజస్ తేలిక శ్రేణి (Tejas light combat ) యుద్ధ విమానాలు పేద సంఖ్యలో ఇండియన్ ఏయిర్ ఫొర్స్ లో చేరనున్నాయి. 83 తేజ యుద్ధ విమానాల తయారీకి భారత వైమానిక దళం తాజాగా హిందుస్థాన్ ఏరొనాటిక్స్ కు ఆర్డర్ ఇచ్చింది. ఈ యుద్ధ విమానం ఒక్కోదాని విలువ దాదాపు 600 కోట్లని తెలిసింది. భారతదేశ రక్షణ రంగ చరిత్రలొ స్వదేశీ ఆయుధాలను కొనుగొలుకు ఇంతవర కూ ఇదే అతిపెద్ద ఒప్పందం అని చెబుతున్నారు. 2016 లొ ఇండియన్ ఏయిర్ ఫొర్స్ ఇచ్చిన 20 తేజస్ విమానాల ఆర్డర్ లో భాగంగా ఇప్పటి వరకు ఐదు విమానాలను హిందుస్థాన్ ఏరొనాటిక్స్ పంపిణీ చేసింది. మిగిలిన 15 యుద్ధ విమానాలు ఆరు మాసాల్లో రానున్నాయి. పాతబడిపోయిన మిగ్ -21 యుద్ధ విమానాల స్థానంలో తేజస్ విమానాలను ఎయిర్ ఫోర్స్ ప్రవేశపెట్టనుంది. 2000 కిలొమీటర్ల వేగంతొ దాదాపు 4000 కిలొల పేలొడ్ ను తీసుకుపోయి, దాడి చేయగల సత్తా తేజస్ సొంతం. ప్రపంచంలొనే అత్యంత వేగంగా దూసుకుపోగల బ్రహ్మాస్ క్షిపణులతొ ఈ విమానాలను అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో తేజస్ యుద్ధ విమానాలు అద్వితీయ శక్తిగా మారాయి.

ముఖ్యాంశాలు