ఇక్కడ తీర్పు అక్కడ తారుమారు : స్వామి


2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణాన్ని బయటపెట్టిన వారిలో ఒకరైన బీజేపీ నేత సుబ్రహ్మణ స్వామి ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై స్పందించారు. ఎగువ కోర్టుకు వెళితే తీర్పు తప్పకుండా తారుమారవుతందన్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో అక్రమాస్తుల కేసులో జయలలిత నిర్దోషి అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, సుప్రీంకోర్టు ఇందుకు భిన్నమైన తీర్పు ఇచ్చిందని స్వామి గుర్తు చేశారు. ఈ కేసు (2జీ)లోనూ అదే జరుగుతుందన్నారు. ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం