రోజా ఇంట్లో చోరీ : పది లక్షల సొత్తు గల్లంతు


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. మణికొండలోని ఆమె నివాసం నుంచి దొంగలు రూ. 10లక్షలు విలువచేసే బంగారం, వెండి అభరణాలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు అందింది. ఇంట్లోని తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉండొచ్చని రాయదుర్గం పోలీసులు పేర్కొంటున్నారు, మణికొండ పంచవటి కాలనీలోని రోజా నివాసానికి చేరుకొని పోలీసులు నిశితంగా పరిశీలించారు. కాగా చోరీ కచ్చితంగా ఎప్పుడు జరిగిందీ తెలియరాలేదు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం