కొండగట్టు గుడికి పవన్ రూ.11 లక్షల విరాళం


జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రూ.11లక్షల విరాళం ఇచ్చారు. తెలంగాణలో తన యాత్రను ఈ గుడి దర్శనం నుంచే పవన్‌ సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి 50 కార్ల భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న అనంతరం పవన్‌ కరీంనగర్‌ చేరుకున్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో కరెంట్ షాక్ కారణంగా ఈ ప్రాంతంలోనే పవన్ కాసేపు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. అయితే ఆంజనేయస్వామే తనను కాపాడాడని.. చెబుతూ అయన ఇవాళ కొండగట్టు ఆలయాన్ని దర్శించుకున్నారు.

ముఖ్యాంశాలు