ఈ ఫోటో ప్రత్యేకత తెలుసా?


ప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూసి నాలుగేళ్లు. క్యాన్సర్‌తో పోరాడుతూ నాగేశ్వరరావు 2014 జనవరి 22న మరణించారు. తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున తాను ఆఖరిగా తీసిన తన తండ్రి ఫొటోను ట్విటర్‌ లో పోస్ట్ చేసారు. మీరు మమ్మల్ని వదిలివెళ్లి నాలుగేళ్లు కావొస్తోంది. ఇప్పుడు మేం చేయగలిగేది మిమ్మల్ని గుర్తుచేసుకుని నవ్వుకోవడమే... ఫోన్‌లో నేను ఆఖరిగా తీసిన నాన్న ఫొటో ఇదే.. అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. ‘మనం’ సినిమా షూటింగ్ లో నాగార్జున ఈ ఫొటో తీశారు. ఈ ఫొటోతో పాటు నాగేశ్వరరావు, తానూ, ఇద్దరు కుమారులు కలసి ఉన్న మనం పోస్టర్ ని కూడా నాగ్గార్జున పోస్ట్ చేసారు. 2014లో మనం వచ్చింది. ఇది నాగేశ్వర్రావు ఆఖరి చిత్రం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం