ఇదీ మోదీ సర్కార్ డిజిటల్ విప్లవం


నాలుగేళ్ల క్రితం 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. మోదీ సర్కారు సుమారు పన్నెండు యాప్‌లు, అంతే సంఖ్యలో వెబ్‌పోర్టళ్లను ప్రారంభించింది. వీటిసాయంతో ప్రజలు ప్రభుత్వంతో ముడిపడివున్న పనులనే కాకుండా, ఇతర అవసరాలనూ నెరవేర్చుకోవచ్చు. వాటిలో కొన్నిటి వివరాలు.. ఉమంగ్: గ్యాస్ బుకింగ్ మొదలు పాస్‌పోర్టు వరకూ ఉపకరిస్తుంది. భీమ్: డిజిటల్ లావాదేవీలకు ఉపయుక్తం. డిజీ లాకర్: ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. డిజిటైజ్ ఇండియా: డాటా ఎంట్రీ ద్వారా సంపాదించేందుకు ఉపకరిస్తుంది. మేరా హాస్పిటల్: ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తదితర వివరాల కోసం... సుఖద్‌యాత్ర: హైవేపై ప్రయాణం మొదలుకొని వివిధ సేవలు అందుకునేందుకు... ఎం- కవచ్: ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు... జీఎస్టీ రేట్ ఫైండర్: ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ ఉన్నదో తెలుసుకునేందుకు... ఐఆర్‌సీటీసీ కనెక్ట్: ఈ యాప్ ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మైగవ్: ఈ యాప్ సాయంతో ప్రభుత్వానికి సలహాలు అందించవచ్చు.

ముఖ్యాంశాలు