EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దు

కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పీడీపీ, కాంగ్రెస్, ఎన్సీ ప్రయత్నిస్తుండగానే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసి సంచలనం సృష్టించారు. మరో నెల రోజుల్లో రాష్ట్రంలో గవర్నర్ పాలన ముగియనున్న తరుణంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు పీడీపీ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తమ పార్టీ ఎన్సీ, కాంగ్రెస్‌తో కలిసి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గవర్నర్‌కి లేఖ రాశారు. బుధవారం ఉదయం ఈ మూడు పార్టీల నేతలు కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి సమావేశమైనట్లు కూడా తెలుస్తోంది. తమ రెండు పార్టీలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ని కలిసేందుకు ప్రయత్నించామని, ఆయన తమకు అనుమతి ఇవ్వలేదని మాజీ సీఎం ముఫ్తీ ట్విట్టర్ లో తెలిపారు.