విద్యాభివృద్ధికి కేంద్రం ఏమి చేసింది?


కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి, విద్యార్థుల వికాసం లక్ష్యాలుగా నిర్వహిస్తున్న,ప్రవేశపెట్టిన వివిధ పథకాల వివరాలు ఇవి. స్వచ్చ విద్యాలయ పురస్కార్. • విద్యాలయాలకు నిర్వహించే ఈ పోటీ 2017 లో ప్రారంభమయ్యింది. 2.5 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఈ పోటీ లో ఆన్ లైన్ లో నమోదు చేసుకుని పోటీ పడ్డాయి. • పాఠశాలల్లో త్రాగునీటి వ్యవస్థ, మరుగుదొడ్లు మరియు తరగతి గది శుభ్రత మొత్తంగా ఆ పాఠశాల లో ఉన్న పారిశుధ్య పరిస్థితి ని పరీక్షించేవారు. • ఈ సంవత్సరం 6 లక్షల ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు స్వచ్చ విద్యాలయ పురస్కార్ పోటీలో పాల్గొన్నాయి. • ఈ పోటీలు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులలో స్వచ్చ సంస్కృతిని అలవర్చుతాయి. ఇది గ్రామాలను, మండలాలను. జిల్లాలను, మొత్తంగా దేశాన్ని స్వచ్చంగా ఉంచే స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దోహదం చేస్తాయి. శగున్ పోర్టల్ • నూతన ఆవిష్కరణలను ప్రదర్శించే మరియు ఎప్పటికప్పుడు సమీక్షించుకోగలిగే ఆన్లైన్ పోర్టల్. • ఎన్నో విజయగాథలను, ఉత్తమ ఆచరణలను పోర్టల్ లో అందరితో పంచుకునేందుకు వీలుగా ఉంచడం జరిగింది. ఇప్పటివరకే పోర్టల్ లో ఉంచబడిన నూతన ఆవిష్కరణలు మరియు సమీక్షలు o కేస్ స్టడీస్ 255 o ధృవీకరణలు/ సమీక్షలు 141 o వీడియోలు 264 o చిత్రాలు 4473 ఈ పాఠశాల • NCERT పుస్తకాలు ఈ పోర్టల్ లో ఉచితంగా లభించేలా చేశారు. • 15 లక్షల మండి విద్యార్థులు ఇప్పటికే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. • ఒక సంవత్సరంలోనే ఈ యాప్ ను చూసిన సందర్శకుల సంఖ్య 30 మిల్లీయన్స్ ను దాటడం విశేషం. ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ • తొమ్మిదవతరగతి నుండి స్నాతకొత్తర విద్య వరకు 15 లక్షల తరగతి గదులను, వచ్చే అయిదేళ్లలో ఇంటరాక్తీవ్ డిజిటల్ బోర్డ్ లతో సంధానం చేయనున్నారు. • ఈ సౌకర్యం వల్ల తరగతి గదులు పూర్తి స్థాయి చర్చా కేంద్రాలుగా పరిశోధన నిలయాలుగా మారనున్నాయి ఉపాధ్యాయులు కొద్ద అత్యంత లోతైన విషయ చర్చ చేయగలిగే అవకాశం ఏర్పడుతుంది. [7:42 AM, 11/22/2018] Pravin Rayudu: పఢే భారత్ బఢే భారత్ • 15.35 లక్షల సీనియర్ సెకండరీ పాఠశాల లైబ్రరీ ల కోసం సంవత్సరానికి రూ.5000-20,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. • పాఠశాలల రేషనలైజేషన్ జరిగిన దగ్గర, ఒక్కొక్క విద్యార్థికి రూ. 6000-00 చొప్పున రవాణా సౌకర్యం కోసం ఇవ్వడం జరుగుతుంది. • ఏకరూప దుస్తుల కోసం ప్రస్తుత ధరను రూ 400 నుండి రూ.600 కు పెంచడం జరిగింది. • ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలలో పుస్తకాల ఖర్చును రూ. 150/250 నుండి 250/450 కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. మధ్యాహ్న భోజన పథకం. • పాఠశాలలలో నడిచే పథకాలలో ప్రపంచంలోనే అతిపెద్ద పథకం గా ఇది నిలచింది. • ప్రతీరోజు 9.5 కోట్ల మండి విద్యార్థులకు 11.4 అక్షల పాఠశాలల్లో తాజాగా వండించబడిన భోజనం అందించబడుతోంది. దీనికి సాలీనా 17000 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. • ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడం కోసం, వంట మరియు ట్రాన్సుపోర్టు పద్దులకింద మరిన్ని నిధులను విడుదలచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ • విద్యార్థులలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీసే ఉద్దేశ్యం తో 2400 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను ఒక్కొక్కటి 20 లక్షల ఖర్చు తో ఏర్పాటు చేయడం జరిగింది. • ఈ అన్నీ పరిశోధన శాలల మొదటి ఒలింపియాడ్ నిర్వహించినపుడు వేలమంది చిన్నారులు తమతమ సృజనాత్మకక శక్తితో తయారు చేసిన ప్రాజెక్టులతో పాల్గొన్నారు. • 3డి ప్రింటింగ్, రోబోటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటల్లిజెన్స్ అంశాలలో విద్యార్థులను ఈ పరిశోధనాశాలలు ప్రోత్సహిస్తున్నాయి. ఉపాధ్యాయుల శిక్షణ • 14 లక్షల మండి శిక్షణ లేని D.El.ED ఉపాధ్యాయులకు స్వయం ప్లాత్ఫామ్ పై శిక్షణ లభిస్తూంది. • ఇప్పటికే మొదటి సంవత్సరం పరీక్ష పూర్తయ్యింది. జాతీయ అసెస్ మెంట్ సర్వే. • ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ అసెస్ మెంట్ సర్వే ఇది. • 3,5 & 8 వ తరగతులకు చెందిన 22 లక్షల మంది విద్యార్థులను 10 వ తరగతికి చెందిన 10 లక్షల మందిని అసెస్ చేయడం జరిగింది. • జిల్లా మరియు రాష్ట్ర అసెస్ మెంట్ వివరాలను ముఖ్యమంత్రులతో మరియు ఎంపీ లతో అధికారులతో పంచుకోవడం జరిగింది. విద్యారంగానికి ప్రతీ సంవత్సరం 20% పెంచిన బడ్జెట్ వివరాలు. • 2017-18 లో రూ. 28000-00 కోట్లు • 2018-19 లో రూ. 34000-00 కోట్లు • 2019 -20 లో రూ. 41000-00 కోట్లు • మొత్తంగా విద్యారంగానికి కేటాయించబడుతున్న గ్రాంటు పరిధిని రూ 14000-50000 కోట్ల నుండి రూ. 25000-100000 కోట్ల వరకు పెంచడం జరిగింది. • SCERT, డైట్, BRC (ఎం‌ఆర్‌సి), CRC లకు గణనీయమైన ఆర్థిక తోడ్పాటును అందించింది కేంద్ర ప్రభుత్వం. • ఖేలే ఇండియా ఖిలే ఇండియా • ప్రతీ పాఠశాలకు ఇకపై రూ.5000 నుండి రూ.25000 వరకు క్రీడా పరికరాల కొనుగోలు కోసం గ్రాంటు అందుతుంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం. • CSWN కేటగిరీలో ఉన్న విద్యార్థినులు నెలకు రూ|| 200 పొందుతారు. • 54000 ర్యాంపులు మరియు రైలింగులు నిర్మాణం చేయబడినవి. • 50,000 ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరిగింది.

విద్యార్థినులకు ప్రత్యేక మరుగుదొడ్లు • విద్యార్థినులకు ప్రత్యేకంగా 1 లక్ష 90 వేల మరుగుదొడ్లు కలుపుకొని మొత్తంగా 4 లక్షల 17 వేల మరుగుదొడ్లు పాఠశాలలలో నిర్మించడం జరిగింది. • ఈ మరుగుదొడ్లను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు, ప్రత్యేక గ్రాంటును కూడా విడుదల చేయడం జరిగింది. • విద్యార్థినులకు ప్రత్యేక మరుగుదొడ్లు/శౌచాలయాలు ఏర్పరచడం పాఠశాలలనుండి డ్రాపవుట్ల సంఖ్యను బాగా తగ్గించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం