కాశ్మీర్ అసెంబ్లీ రద్దు.. అసలేం జరిగింది ?


మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం కోసం చేపట్టే ఎమ్మెల్యేల కొనుగోలును రాజకీయ పరిభాషలో హార్స్ ట్రేడింగ్ అంటారు. కాశ్మీర్ లో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. కాంగ్రెస్, పిడిపి సంకీర్ణ సర్కారుకు అవసరమైన ఎమ్మెల్యేల కొనుగోలు పెద్దఎత్తున జరుగుతోంది..ఇందుకోసం కాంగ్రెస్ మిత్రపక్షంలోని ఓ పార్టీ నాయకుడు ఇటీవల ఢిల్లీ వెళ్లి పెద్దఎత్తున డబ్బు ఇచ్చి వచ్చాడట. ఆ డబ్బుతో కొనుగోళ్లు కానిచ్చి ఇక సర్కారు ఏర్పాటు చేసేద్దాం అనుకునే టైం కి గవర్నర్ కాస్తా అసెంబ్లీని రద్దు చేసి పారేసారు! అదీ అసలు సంగతి. దీంతోఇప్పుడు దేశంలో బిజెపి వ్యతిరేక కూటమి మొత్తం పూనకం వచ్చినట్టు ఊగిపోతోంది. కీలెరిగి వాత పెట్టినట్టు..డబ్బంతా చేతులు మారాకా ఇలా అసెంబ్లీ ని హాంఫట్ చేసి పారేయడం చూసి పాపం జమ్మూ కాశ్మీర్ లోని పిడిపి, కాంగ్రెస్ తో సహా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం వరకూ అనేక పార్టీలు మోడీని ఆడిపోసుకుంటున్నాయి. అయితే ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. గత ఐదు మాసాలుగా అసెంబ్లీని రద్దు చేయాలని కోరినదెవరు? స్వయంగా ఈ కాంగ్రెస్, ఈ ముప్తి పార్టీలుగా. మరి ఇప్పుడు ఆ పనే చేస్తే విమర్శలెందుకు? అప్పుడు తమకు అనుకూలంగా పరిస్థితి లేదు కాబట్టి అసెంబ్లీ రద్దు అడిగారు. ఇప్పుడు ఎవరో కిట్ బాగ్ లు తెచ్చి డబ్బులిచ్చేసరికి జోరుగా ఎమ్మెల్యేలను కొనేసి కొత్త సర్కారు ఏర్పాటుకి సిద్ధం అయిపోయారు. ఎంత దారుణం అంటే బిజెపితో కలిసి సర్కారు నడిపిన పిడిపి ఇప్పుడు దానికిబద్ద విరోధి అయిన కాంగ్రెస్ తో అధికారం పంచుకోవడానికిసిద్దం అయిపోయింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తీశారు. ఈ విషయాన్ని స్వయంగా గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. 15రోజులుగా రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు.ఇలా ఫిరాయింపుల ప్రభుత్వాన్ని తాను అంగీకరించబోనన్నారు. సాధ్యంకాని పొత్తుతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడదని తెలిపారు.తాను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్ట ప్రకారమే అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయిదు నెలలుగా వాళ్లే అసెంబ్లీని రద్దు చేయాలని అడిగారు. ఇప్పుడు ఆపనిని నిరసిస్తూ కోర్టుకు వెళ్తాం అంటున్నారు. వెళ్ళాలనుకుంటే అది వాళ్ల హక్కు, వెళ్లొచ్చు అని మాలిక్‌ తెలిపారు.

ముఖ్యాంశాలు