కృత్రిమ మేధతో లక్షల కోట్లు.. కానీ ప్రగతి నిస్సారం


కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో లక్షల కోట్లు సమకూరనున్నాయి. 2035 నాటికి దీని ద్వారా జీడీపీకి 957 బిలియన్‌ డాలర్ల (రూ.62 లక్షల కోట్లకు పైగా) సంపద భారత ఆర్థిక వ్యవస్థకు జత చేరుతుందని అమెరికాకు చెందిన సాంకేతిక దిగ్గజ సంస్థ యాక్సెంచర్‌ అంచనా వేస్తోంది. పని తీరునే కృత్రిమ మేధ మారుస్తుందని, వ్యాపారాలకు, సమాజానికి మెరుగైన అనుభవాలు లభిస్తాయని యాక్సెంచర్‌ నివేదిక వివరించింది. నూతన సాంకేతికతలు, ఏటా ఆర్థిక వ్యవస్థకు 1.3 శాతం మొత్తాన్ని జతచేస్తుంటాయని, ఇందువల్ల 2035 నాటికి దేశ ఆదాయం 15 శాతం పెరుగుతుందని తెలిపింది. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ కనీసం 6.4 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.416 లక్షల కోట్ల) స్థాయిలో ఉంటుంది. దీనికి కృత్రిమ మేధ 957 బిలియన్‌ డాలర్లు (రూ.62 లక్షల కోట్లకు పైగా) జత చేయనుంది. ఫలితంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ 7.355 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.480 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుంది. సామాజిక ఆర్థిక అంతరాలు తగ్గించడంలో కృత్రిమ మేధ ప్రధాన పాత్ర పోషించనుందని యాక్సెంచర్‌ ఇండియా ఛైర్మన్‌ రేఖా మేనన్‌ పేర్కొన్నారు. అయితే కృత్రిమ మీద అభివృద్ధికి సంబంధించి కీలక అంశాల్లో జీ20 దేశాల్లో భారత్‌ వెనుకబడిందని కూడా నివేదిక వివరించింది. సాంకేతిక విశ్వవిద్యాలయాలు దీనిపై ప్రాథమిక పరిశోధనలు జరపుతున్నా, వాటి బలోపేతంపై దృష్టి సారించడం లేదని నివేదిక విశ్లేషించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us