ఐఎన్ఎస్ అరి ఘాత్ రంగ ప్రవేశం


ఐఎన్ఎస్ అరి దమన్.. ఐ ఎన్ ఎస్ అరి ఘాత్ సంస్కృతంలో ఈ రెంటి అర్థాలు కూడా శత్రు భయంకరాలే! అరి అంటే శత్రువు.. ఆ శత్రువు ను దమించేది అని మొదటి దాని అర్థం అయితే, శత్రువును దెబ్బ తీసేది అని రెండో దాని అర్థం. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఏమిటంటే.. భారత నావికాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త, అత్యంత అధునాతన జలాంతర్గామి తాజాగా రంగ ప్రవేశం చేసేసింది. అత్యంత శక్తిమంతమైన న్యూక్లియర్ సబ్ మెరైన్ ఇది. దీని పేరు ఐ ఎన్ ఎస్ అరి ఘాత్. దీని వివరాలను, సాంకేతిక సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మేకిన్ ఇండియా నినాదం గర్వించేలా దీనిని భారతదేశంలోనే తయారు చేసారు. ఇది మన దేశంలోనే తయారైన స్వదేశీ పరిజ్ఞానం కలిగిన రెండవ జలాంతర్గామి. ఇటీవల రహస్యంగా జరిగిన కార్యక్రమంలో ఈ న్యూ క్లియర్ సబ్ మెరైన్ ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ పాల్గొన్నారని భోగట్టా. సాగర జలాల్లో 1300 అడుగుల లోతులో కూడా ౪౫ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల అరి ఘాత్ జలాంతర్గామిలో ఒకేసారి గరిష్టంగా 8 శక్తిమంతమైన అణు క్షిపణులను ప్రయోగించగల వీలు ఉండడం విశేషం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం