ఆలయాల్లో జనవరి 1 పండుగ కాదు


ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ఎలాంటి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ అనుబంధ హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు అన్ని ఆలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్లేయులు అంటగట్టిన నూతన సంత్సరాది (జనవరి 1)ని నిర్వహించటం భారతీయ వైదిక విధానం కాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. జనవరి 1 న ఆలయాల్ని అలంకరించటం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయటం, శుభాకాంక్షలు తెలపడం సరికాదని దేవాదాయశాఖ భావించింది. అందుకే అలాంటి కార్యక్రమాలేవీ చేయవద్దని రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ఆదేశాలు ఇచ్చారు. భారతీయ సంప్రదాయం కానివాటి కోసం హిందూ ఆలయాల్లో డబ్బు ఖర్చు చేయడం సరికాదని అధికారుల అభిప్రాయం. తెలుగు సంవత్సరాది ప్రకారం ఉగాది రోజున మాత్రమే వేడుకలు జరపాలని దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధ సూచించారు.

ముఖ్యాంశాలు