స్వరాజ్య సమరంలో చిరంజీవి నేతాజీ

(జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా)

‘స్వాతంత్ర్యం అంటే బిచ్చమడిగి తీసుకునేది కాదు.. పోరాడి సాధించుకోనే హక్కు..’ ‘నేను మీకు ఆకలి. దాహం, కష్టం, మృత్యువు మాత్రమే ఇవ్వగలరు.. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను..’ ఈ మాటలు చాలు ఆయన వజ్ర సంకల్పం గురుంచి చెప్పడానికి.. బ్రిటిష్ వారి కబంద హస్తాల నుండి భారత దేశానికి స్వాతంత్ర్యం ఇప్పించానికి ఎందరో మహనీయులు, యోధులు తమ తమ మార్గాల్లో పోరాటం సాగించారు.. అందరూ నాయకులే(నేతలే).. కానీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతాజీ ఒకరే.. ఆయనే సుభాష్ చంద్రబోస్..

సివిల్ సర్వీసును వదలి స్వాతంత్ర్య సమరంలోకి..
చరిత్ర తిరిగేస్తే గొప్ప వ్యక్తులందరి జనన మరణాలు కనిపిస్తాయి. కానీ జననమే తప్ప మరణం నమోదు కాని వ్యక్తి ఒక్కరే. ఆ అరుదైన గౌరవం సుభాష్ చంద్రబోస్ సొంతం. 1897లో జనవరి 23వ తేదీన కటక్ పట్టణంలో ప్రభావతి దేవి, జానకీనాధ్ బోస్ దంపతులకు జన్మించారు సుభాష్ చంద్రబోస్. జానకీనాధ్ బోస్ పేరొందిన న్యాయవాది, జాతీయవాది. తండ్రి ప్రభావం సుభాష్ పై ఎక్కువగా ఉండేది. బోస్ విద్యాభ్యాసం కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ, ఫిట్జ్ విలియమ్ కాలేజీలో సాగింది ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉండే సుభాష్ చంద్రబోస్ 1920లో ఇండియన్ సివిల్ సర్వీసు(ఐసీఎస్) పరీక్షకు హాజరై నాలుగో ర్యాంకు సాధించారు. బ్రిటిష్ పాలనలో ఆనాటి దేశ పరిస్థితులు బోసుబాబును ఎంతో కలిచివేశాయి. దీంతో ప్రతిష్టాత్మకమైన ఐసీఎస్ నుండి వైదొలిగారు స్వాతంత్ర్య పోరాటంలోకి దిగారు. భారత జాతీయ కాంగ్రెస్ లో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోశించారు.. మహాత్మా గాంధీ సూచన మేరకు చిత్తరంజన్ దాస్ తో కలసి బెంగాల్ లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. 11 మార్లు జైలుకు వెళ్లడంతో పాటు ఎన్నోసార్లు గృహ నిర్భందాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 
సుభాష్ చంద్రబోస్ తనదైన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలతో అందరి మన్ననలను పొందారు. కాంగ్రెస్ లో కీలక నాయకునిగా గుర్తింపు పొందారు. ఈ దశలో 1938లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో గాంధీజీ సూచించిన పట్టాభి సీతారామయ్యపై పోటీ చేసి విజయం సాధించారు సుభాష్ బాబు. పట్టాభి సీతారామయ్య ఓటమిని తన పరాజయంగా భావించారు గాంధీజీ.

అహింస చాలదు.. పోరాడి సాధించాల్సిందే..
సుభాష్ చంద్రబోస్ కు మహాత్మాగాంధీతో భిన్నాభిప్రాయాలు ఉండేవి. అయినా ఆయన్ని మహానాయకునిగా అంగీకరించేవారు బోసు బాబు. గాంధీజీ సూచించిన అహింసా మార్గంతోనే స్వరాజ్యం వస్తుందనే వాదనతో విబేధించారు సుభాష్ చంద్రబోస.. బ్రిటిష్ వారిని దేశం నిండి తరిమి కొట్టడానికి సాయుధపోరాటం అవసరమని వాదించేవారు. గాంధీజీతో సిద్దాంతపరమైన అభిప్రాయ బేధాలు, వర్గప