అంతర్జాతీయ వ్యాపారానికి అద్భుత అవకాశాలు


అంతర్జాతీయ వ్యాపారానికి భారత్‌లో అద్భుతమైన అవకాశాలున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసలు భారత్‌ అంటేనే బిజినెస్‌ అని చెప్పారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సుకు హాజరైన మోదీ అక్కడ ప్రపంచ దేశాల ప్రముఖ సీఈఓలతో సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం దావోస్‌ చేరుకున్న మోదీ మంగళవారం సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. అలాగే డబ్ల్యుఈఎఫ్‌లోని అంతర్జాతీయ బిజినెస్‌ కమ్యునిటీ సభ్యులతో కూడా మోదీ భేటీ అవుతారు. గత 20ఏళ్లలో దావోస్‌ సదస్సుకు హాజరైన తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. సీఈఓల సమావేశం సందర్భంగా భారత ప్రధాని మాట్లాడుతూ భారత్ సాధిస్తున్న అభివృద్ధి, భారత్ లో గల అపార అవకాశాల గురించి వివరించారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి అంతర్జాతీయ కంపెనీల 40 మంది సీఈఓలు, భారత్‌కు చెందిన 20 మంది సీఈఓలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. మోదీ భారత అభివృద్ధి గురించి, ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారావకాశాల గురించి దావోస్‌లో వివరించారని సీఈఓలతో సమావేశం అనంతరం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

ముఖ్యాంశాలు