ఇండోనేషియాలో  భారీ భూకంపం


ఇండోనేషియాలో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. ఈ ధాటికి రాజధాని జకార్తా వణికిపోయింది. భవనాలు, ఇతర నిర్మాణాలు ప్రకంపనలకు గురయ్యాయి. కొన్ని సెకన్లపాటు అన్నీ తొణికిసలాడుతూ కనిపించాయి. కార్యాలయాల్లో పనిచేస్తున్నవారంతా భయంతో బయటకు పరుగులు తీయగా వాహన చోదకులు వాటిని ఎక్కడికక్కడే ఆపేశారు. పలువురు భయంతో వాహనాలు వదిలేసి పరుగులు పెట్టారు. అధికారిక సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. జకర్తాకు 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ముఖ్యాంశాలు