మహిమాన్వితం సూర్యనార్ కోయిల్ మందిర్


ఓం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహోద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నమ్ ప్రణతోస్మి దివాకరం ఇది సూర్యనార్ కోయిల్ మందిర్...తమిళ్ నాడు లోని తంజావూర్ దగ్గరలో ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే కుంబకోణం, మయవరం మధ్య గల తిరుమంగళక్కుడి పట్టణానికి ఒక కిలోమీటర్ దూరం. ఈ ఆలయానికి మరో పేరు ఉంది.. సూర్య స్థలం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు.. ప్రధానంగా శని దోష గ్రస్తులు, అష్టమ శని, జన్మ శని దోషంతో బాధలు పడేవారు ఇక్కడికి విముక్తి కోసం వస్తారు. ఇక్కడికి దగ్గరలో మొత్తం 15 తీర్థాలు ఉన్నాయి. ఈ ఆలయంలో జ్ఞాన కూపం అనే తీర్థం ఉంది. అలాగే సూర్య పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి కూడా పవిత్రమైనది.. ఆరొగ్యదాయకమైనది అని చెబుతారు. ఎర్ర కలువ (రెడ్ లోటస్) పూలతో ఈ సూర్యుడిని పూజిస్తే మంచి జరుగుతుందని ఇక్కడివారి నమ్మకం. కోరికలతో పాటు గోధుమ రవ్వ, చక్రపొంగలి నివేదన చేస్తారు. అందరికీ ఆదిత్యుడి అనుగ్రహం కలగాలని, ఆ దర్శన ఫలితం ఇది చూసినంతనే లభించి సర్వ దోషాలు పరిహారమైపోవాలని కోరుకుంటూ... మిత్రులు, పెద్దలు, శ్రేయోభిలాషులు అందరికీ శుభోదయం.

ముఖ్యాంశాలు