EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. శాసనసభ్యుల కోటా కింద జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్‌ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌- మే నెలలతో ముగియనుండటంతో ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మార్చి 5న నోటిఫికేషన్‌ ప్రకటించనుంది. మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు , అదే సాయంత్రం  5గంటలకు ఓట్ల లెక్కింపు చేయనున్నట్టు ఈసీ తెలిపింది. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రస్తుతం చిరంజీవి, దేవేందర్‌ గౌడ్‌, రేణుకా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నా స్థానాలు, తెలంగాణ నుంచి సి.ఎం. రమేశ్‌, రాపోలు ఆనంద్‌భాస్కర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇటీవల పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కన్నుమూయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. రాష్ట్ర విభజన సమయంలో సీట్ల కేటాయింపు కారణంగా దేవేంద్రగౌడ్‌ తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికయ్యారు. అలాగే సి.ఎం. రమేశ్‌ ఏపీకి చెందినవారైనప్పటికీ ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఆరు స్థానాల్లోనూ కొత్తగా అభ్యర్థులను నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే.. ఏపీలో అధికార తెదేపా రెండు స్థానాలను కైవసం చేసుకోనుంది. మూడో స్థానం వైకాపాకు దక్కే అవకాశం ఉంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం వైకాపా, అధికార పక్షం తెదేపాల మధ్య మూడో సీటు వ్యవహారంలో మాత్రం ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వైకాపా నుంచి 22 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరడంతో ఆ పార్టీ సంఖ్యాబలం తగ్గింది. అధికార పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గనక తోడైతే ఉన్న మూడో సీటు కూడా తెదేపా కైవసం చేసుకొనే అవకాశం లేకపోలేదు. 
 

Facebook