ఎంపీ విజయసాయిరెడ్డి అరెస్ట్‌


వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని విశాఖ నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ నగరంలో నిన్న జరిగిన టీడీపీ ధర్మపోరాట సభకు వేదికైన మైదానాన్ని శుద్ధి చేయాలన్న వ్యూహంతో విజయసారెడ్డి నేతృత్వంలో వైకాపా నేతలు ఈ ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఏయూ గ్రౌండ్ వైపు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి 16వ నంబర్‌ జాతీయ రహదారిపై కృష్ణా కళాశాల వద్ద బైటాయించారు. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళన విరమించకపోవంతో సెక్షన్ 151 ప్రకారం ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం