ఆస్థానా వెనుక మోదీ ఉన్నారు - సీతారాం


సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా కేసు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శలు గుప్పించారు. నరేంద్రమోదీ మనిషి అయిన రాకేశ్‌ ఆస్థానా ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని ఒకట్వీట్ లో ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాకేశ్‌ ఆస్థానాను మోదీ ఎంపిక చేశారని ఆరోపించారు. ఆయన్ను ఉన్నత స్థానంలో నియమించి భాజపా నేతలపై ఉన్న కేసుల విచారణను జరగకుండా ఆపించాలని కుట్ర పన్నారని, అది వారి తలకే చుట్టుకుందని విమర్శించారు. మాంసం ఎగుమతిదారుడు మొయిన్‌ ఖురేషి కేసులో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై అక్టోబరు 15న సీబీఐ రాకేశ్‌ ఆస్థానాపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం