వ్యవస్థల నాశనం... ఒక పరిశీలన


నరేంద్ర మోడీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయని తెలుగుదేశాధినేత నారా చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు. మరి ఆయన పాలనలో వ్యవస్థ లు ఎలాఉన్నాయి? నిజానికి వ్యవస్థలను నాశనం చెయ్యటం అనే కళలో టీడీపీ కి సాటి మరొకరు లేరు. ఇది నిజమో కాదో కొన్ని వ్యవస్థలను తెదేపా తీర్చిదిద్దిన తీరుని బట్టి పరిశీలిద్దాం. నీటిపారుదల వ్యవస్థ : పోలవరం ప్రాజెక్టు పరంగా జరిగిన అవినీతి జగద్విదితం. చంద్రబాబు పవర్లోకి రాగానే ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచేసి, నిధులను ఇష్టారాజ్యంగా ఇతర ప్రాజెక్టులకు మళ్లించిన విషయం తెలిసిందే. నీటిపారుదల శాఖ అవినీతిలో అన్ని ఎల్లలూ దాటిపోయింది. విద్యా వ్యవస్థ : విద్యావ్యాపారం చేసేవారిని నిస్సిగ్గుగా మంత్రి పదవులలో కూర్చోపెట్టి కైంకర్యాలు జరిపిస్తున్న పాలన నారా వారిది. చిన్నారి కుసుమాలు ఆ కళాశాలల్లో ఆత్మహత్యలతో కునారిల్లు తుంటే ,.. తమకొచ్చే లాభమెంత, జరపగలిగే అవినీతి ఎంత అంటూ లెక్కలు వేసికొంటూ సాగుతున్న వీరి పరిపాలన చుస్తే వేదన కలుగుతుంది. ఆత్మగౌరవం కి దెబ్బ పడిపోతున్నదని గోలపెడుతూ .. అవినీతిని ప్రశ్నించకుండా, సిబిఐ నే అడ్డుకోవడం తెలిసిన సంగతే. -స్త్రీ సంక్షేమ వ్యవస్థ : ట్రిపుల్ తలాక్ నిరోధానికి తెదేపా వ్యతిరేకం. రిషితేశ్వరి, వనజాక్షి పై దాడులు .. ఆయేషా మీరా కేసులో రికార్డులన్నీ ధ్వంసం. మంత్రి కుమారులు నడిరోడ్డుపై టీజింగ్ చేసిన వ్యవహారాలు, మహిళలపై దాడులు .. కాల్ మనీ, సెక్స్ రాకెట్ దందాగాళ్ళకు ఈ పాలన స్వర్గధామం -పార్లమెంటరీ వ్యవహారాలు : విలువైన సభా సమయం వృధా చేయడంలో దిట్టలు. డబ్బూ పోయి దరిద్రం పట్టింది. దేశం లో తీవ్రవాదులు కూడా వారి కార్యక్రమాలను రహస్యంగా చేస్తారు, బయట పడటానికి భయపడతారు. అంతెందుకు కాశ్మీర్ హురియత్ కాన్ఫరెన్స్ కూడా దేశ విభజన గురించి బహిరంగంగా మాట్లాడటానికి సిగ్గు పడుతుంది. కానీ దేశ విభజన అంటూ తీవ్రవాదాన్ని పార్లమెంటు కు చేర్చిన తెదేపాఎంపీ మురళీ మోహన్ వ్యవస్థని ఎంత బలోపేతం చేసారో అర్థం చేసుకోగలం. మాడబ్బు మాకు ఇచ్చేయండి .. విడిపోతాం .. మేము భారత్ లోనే వున్నామా .. ఇవన్నీ ఏమి మాటలు, ఏమి చేష్టలు? మేము అంటే ఆ ముఠా ఎవరు .. ఖచ్చితంగా ప్రజలైతే కాదు .. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ప్రజలకు బొచ్చె కూడా మిగల్చరు అని అర్థం అవుతోంది. రాజకీయ వ్యవస్థ : పొత్తుల చెత్తలు ఇక మాట్లాడాల్సింది ఏముంది ? రాష్ట్రం లో లక్షల కోట్ల ప్రజాధనం అవినీతి మయమవుతుంటే .. ఎప్పుడైతే కేంద్రం ప్రశ్నించటం మొదలు పెట్టిందో అప్పటినుండి బీజేపీ కి తెదేపా దూరమవుతూ వచ్చింది. కేంద్రం స్వరం పెంచటంతో మద్దతు ఉపసంహరించుకొన్నారు. పార్లమెంట్ లో భంగపడటం తో కాంగ్రెస్ వైపు చూసింది. ఎప్పుడైతే ప్రయివేటు అవినీతి సంస్థలపై రైడ్స్ జరిగాయో జాతీయ స్థాయిలో రక్షణ అవసరం అనుకొని ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్ళటం ఆతర్వాత కాంగ్రెస్ తో చేతులు కలపటం జరిగి పోయాయి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఏమి చెయ్యాలి అని కేంద్ర రాష్ట్రాలు సుదీర్ఘ చర్చలు జరిపి చివరి రోజు ఆరు గంటలపైగా చర్చించి ఉభయుల అంగీకారాన్ని ప్రజలకు తెలియ చేయాల్సిన, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ప్రకటన సమయం లో కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళలేదు. రాష్ట్ర భవిష్యత్తు కు సంబంధించిన అంత కీలక నిర్ణయం ప్రకటననే చంద్రబాబు తేలిగ్గా తీసుకొన్నారు. కానీ ప్రయివేటు వారి పై ఆదాయపు పన్ను దాడుల తంతు మొదలైన వెంటనే ఇంతకంటే ఇంకేమీ సమస్యలు లేవన్నట్లు ఢిల్లీకి వెళ్లారు. అంతకు మునుపు 29 సార్లు ఢిల్లీ ప్రయాణం .. అద్దంకి వెళ్ళొచ్చినట్లు జరిగింది .. అసెంబ్లీ సీట్లు పెంచండి, జగన్ ను లోపలెయ్యండి ఒకటి సారి .. రెండో సారి ఇరవై తొమ్మిదో సారి అంతే. సామాజిక వ్యవస్థ : BC లకు అవమానం., దళితుల ను ఒకరిపై ఒకరికి ఎగదోసి వారిని అవమాన పరచటం బ్రాహ్మణులపై దాడి. వైశ్యుల ను అవమాన పరచటం. రెడ్డి సామాజిక వర్గాన్ని చులకన చేయటం. శివాజీ రాజా పైకి శ్రీ రెడ్డిని వదలటం. కాపుల పరిస్థితి మరీ హీనం .. వీరు గౌరవించింది ఒక్క రోహింగ్యాలను మాత్రమే అందరూ బానిసల్లా బతకాలని కోరుకోవటం వీరి లౌక్యం. రోడ్లు భవనాల వ్యవస్థ : ఈ విషయం లో వీరు అవినీతికి మహారాజా పోషకులు , కనిపించని భవనాలు .. నీళ్లు కారే ప్రకృతి సౌందర్యం .. పగిలిపోయిన పోలవరం రోడ్లు .. చెప్పుకుంటుంటేనే కడుపు తరుక్కుపోతోంది ఆర్ధిక వ్యవస్థ : ప్రతిఒక్కరూ 1 జీబీ డేటా వాడితే 2% జీడీపీ పెరుగుతుందన్న చిన్న దొర జోకులు పక్కన పెడితే .. ఇందులో చెప్పుకోవాల్సినవి చాలా వున్నాయ్ . 1. FRDI బిల్లు పై వీరి మీడియా ద్వారా అపోహలు సృష్టించి బ్యాంకుల్లోచి ధనాన్ని బయటకు తీయించి ఈ కాల్ మనీ కామ పిశాచాలను మేపే ప్రయత్నం , బ్యాంకుల్ని నిర్వీర్యం చేసి అవసరానికి , అభివృద్ధికి లోన్లు అందకుండా చేసి ఆర్ధిక వ్యవస్థను నాశనం చెయ్యాలని చూడటం. మీ బంగారం మోడీ ఎత్తుకు పోతాడని ప్రజల్లో ఆర్ధిక భయాలు సృష్టించటం. ఆర్ధిక నేర సామ్రాజ్యం కాంగ్రెస్ తో చేతులు కలపటం. అపరిమిత అవినీతి ... ఎనిమిది లక్షల కోట్లు తలా తోకా లేకుండా ఖర్చు చేశారు లేదా చూపారు. రాష్ట్ర అభివృద్ధి : ఆంద్ర ప్రదేశ్ కి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు జైట్లీ చంద్రబాబు వుమ్మడి ప్రెస్ మీట్ కు చంద్రబాబు గారు వెళ్ళలేదు. ఇంతకంటే కీలకమైన ముఖ్యమైన పని ఏమి ఉంటుంది? సరే ప్యాకేజీ ఇష్టం లేక పోతే ఆ ప్రెస్ మీట్ లోనే బీజేపీ ని కడిగి పారేసే అద్భుత అవకాశాన్ని ఎందుకు వదులుకొన్నారు? రాష్ట్ర చరిత్రలోనే ఇంత కీలక సమావేశానికి మీరు గైరుహాజరైతే, మీకు రాష్ట్రం పై శ్రద్ధ లేదు అనే కదా అర్ధం! దీనికి తోడు నిర్లజ్జగా దేశవిభజన వ్యాఖ్యలు..మాడబ్బు మాకుఇచ్చేయండి .. విడిపోతాం .. మేము భారత్ లోనే వున్నామా .. ఇవన్నీ ఏమి చేష్టలు? 12 వేలకోట్లు ఖర్చుతో (2015 అవినీతి రహిత ఎస్టిమేట్ ) పోలవరం రాష్ట్రం లో అద్భుతాలు సృష్టించి వెలుగులునింప గలిగినప్పుడు , ఈ నాలుగు సంవత్సరాల బడ్జెట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు అయిదున్నర లక్షల కోట్ల పై మాటే (బడ్జెట్లు చూడండి , యనమల రామ కృష్ణుడు గారే స్వయంగా చెప్పారు) .. మరి ఆ అయిదున్నర లక్షల కోట్లు కనీసం మిణుగురు పురుగుల్ని కూడా సృష్టించలేదెందుకు ? ఎక్కడో వాసన తేడా గా లేదూ ? ఈ అయిదున్నర లక్షల కోట్ల లో కేంద్ర సబ్సిడీలు కలపలేదు .. కేంద్రం ఇచ్చింది మట్టి నీళ్లు మాత్రమే అనుకొన్నా .. మీరు తెచ్చుకొన్న డజన్ల కొద్దీ లక్షల కోట్ల పెట్టుబడులూ , అమరావతి విరాళాలు , చేసిన అప్పులూ అన్నీ ఏమయ్యాయి ? ఈ నాలుగున్నరేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల ఖర్చు చూపారు. నాలుగున్నర సంవత్సరాల్లో ఎనిమిదిలక్షల కోట్లు అంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉండాలి. కానీ ఏమి జరిగింది... చివరకు మిగిలింది నీళ్లు జల్లెడ పట్టే భవనాలు .. పగిలిన రోడ్లు , పూర్తికాని ఫ్లై ఓవర్ లకు రంగులు... ఇదీ మీ ట్రాక్ రికార్డు. కేంద్రం ఏభై లక్షల కోట్లిచ్చినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అని దీని ద్వారామీరు స్పష్టం చేసారు. న్యాయ వ్యవస్థ : ఇక్క డ పెద్ద హాలీవుడ్ కధలే నడిచాయి. "స్టే" ల పైనే నడుస్తోంది మీ రాజకీయ జీవితం అంతా. ఒకాయన ఎప్పుడూ న్యాయమూర్తి గా క్రింది కోర్టులలో పనిచేసిన అనుభవం లేకుండానే పై కోర్టు న్యాయమూర్తి అయిపోయిన గొప్ప చారిత్రాత్మక భీభత్సం వెనుక.. ఆయనకు జాకీలు పెట్టి లేపిన శక్తుల ప్రమేయం ఉంది. రాష్ట్రం లో శాంతి భద్రతలు క్షీణిస్తే.. ఆ మాటలే అడిగితే గవర్నర్ తన విధులను నిర్వహించటం కూడా తప్పంటారు డ్రైనేజీ వ్యవస్థ : కేంద్రం డ్రైనేజీ కి ఇచ్చిన 900 కోట్లు ఏమైనాయో తెలీదు .. డ్రైనేజీ లో మంచినీరు కలిసి గుంటూరు లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పొయ్యాయి . ఇక ఈ పెద్దల కుటుంబసభ్యుల వివరాలైతే అవి డ్రైనేజీ కంటే కంపు. టీడీపీ పాలన లోని అవినీతిని నలుగురు చీఫ్ సెక్రటరీలు తప్పు పట్టారు. రాజ్య సభలో కూడా వీరి అవినీతి పై చర్చ జరిగింది . ఎప్పటిలాగే పచ్చ మీడియా వీటిని కవర్ చెయ్యలేదు . మరుదొడ్ల నిధులు కూడా నాకేశారు. అసెంబ్లీ - ప్రజాస్వామ్య వ్యవస్థ : ప్రతిపక్ష పార్టీ వారిని కొనేసి మంత్రులు గా చేసికోవటం. కర్ణాటక లో నడిపిన వెకిలి రాజకీయాలు కాశ్మీర్ లో కూడా చేపట్టడం. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించటం, కశ్బీర్ లో ఎమ్మెల్యేలను బెదిరించటం దాంతో అసెంబ్లీయే రద్దు కావటం. ఓటుకు నోటు వ్యవహారంతో తెలుగు వారు అంటేనే ఇతరులు అసహ్యించుకునే స్థాయికి తెచ్చారు. ఇదే కొనసాగితే తెలుగు వారిని పిండారీలు, ధగ్గులని చూసినట్లు చూస్తారు. "ఎప్పుడో చాలాకాలం క్రితం మా పూర్వీకులు తెలుగు రాష్ట్రాల్లోకి స్థిరపడ్డారు అందుకని తెలుగు వచ్చు .. అంతేకానీ మేము బేసిక్ గా తెలుగు వారము కాము " అని చెప్పుకొనే పరిస్థితి తీసుకు వస్తున్నారు . రాష్ట్రము లో లక్షల కొద్దీ బోగస్ ఓట్లు కొత్తగా రాగా, ప్రతిపక్ష అనుకూల ఓట్లని రద్దు చేయించారు. కార్యకర్తలు ఒక పార్టీ నుండి వేరొక పార్టీ కి మారటం సహజం. అదే ప్రతిపక్షం లోకి మారితే పోలీసుల తో అడ్డుకోవటం. యాత్రల పేరుతో, సభల పేరుతో కోట్ల కొద్దీ ప్రజాధనం వృధా చెయ్యటమే కాక RTI అన్న వ్యవస్థనే నిర్వీర్యం చెయ్యటం

# ఇతర వ్యవస్థలు : RTI అన్న వ్యవస్థనే నిర్వీర్యం చెయ్యటం . నాకు సీఐడీ వుంది .. అది వుంది ఇది వుంది అంటూ బెదిరించటం .. పరిపాలనను గాలికి వదిలి ఫ్రాన్స్ పేరుతో విహార యాత్రలు ..

# ప్రజా అవసరాలు వ్యవస్థలు : దేశ వ్యాప్తంగా పెట్రోలు ధరలు తగ్గినా రాష్ట్రం లో అత్యధిక పెట్రోల్ ధరలు

బీసీ వెల్ఫేర్ వ్యవస్థ : ఐలయ్య గారి చేత బీసీ లను తిట్టించటం , బీసీ లకు అవమానాలు .. దళితుల్ని పరుషంగా మాట్లాడటం , ముఖ్యమంత్రి సమక్షం లోనే స్వామి వారి పై కుళ్ళు జోకులు వేసి నవ్వుకోవటం దేవాలయ వ్యవస్థ : దీనిని అయితే పూర్తిగా నాశనం చేశారు. సర్వమత సమానత్వం అంటే బొట్టు తుడిపేసుకోవటం అనే వికృత సాంప్రదాయం సృష్టించటం., భగవంతుని సేవకు చెప్పులతో వెళ్ళటం. దేవాలయాల కూల్చివేత , పింక్ డైమండ్ అవినీతి. టీటీడీ చైర్మన్ గా అన్య మత ప్రచారకులుని నియమించటం. పంచాయతీరాజ్ వ్యవస్థ : ఇక్కడ అకృత్యాలకు హద్దే లేదు . పంచాయితీలకు నిధుల్ని కేంద్రం పెద్దఎత్తున పంపినా .. కేంద్రం నుండి ఏమీ రాలేదంటూ అబద్ధాలు చెప్పడం, నిధిని దుర్వినియోగం చేయడం. మాడబ్బు మాకు ఇవ్వండి అంటే ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వమని కాదు. మాడబ్బు (ప్రజల డబ్బు) మాకు (మా దోపిడీ దారులకు ) ఇవ్వండి అని అర్ధం వచ్చేలా వ్యవహరించడం. గ్రామాలకు అయ్యే ఖర్చు గ్రామాల ఆదాయం నుండి రాదు. పట్టణాల రెవెన్యూ గ్రామాలకు వాడతారు. ఎక్కడి డబ్బు అక్కడే అంటే గ్రామాలను మట్టి దిబ్బలను చేస్తారా. గ్రామీణ ప్రాంతాలంటే మీకు అంత చులకనా ? ట్రైబల్ వెల్ఫేర్ , ఎంప్లాయిమెంట్ వ్యవస్థ : ఉపాధి హామీ పనుల్లో రూ.7వేల కోట్లు స్వాహా , కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్‌కౌంటర్‌ ద్వారా సాక్ష్యాలు నాశనం .. ఆయేషా సాక్ష్యాలు మిస్సింగ్ హౌసింగ్ వ్యవస్థ : ఇక్కడ చదరపు అడుగు లెక్కల్లోనూ భారీ వ్యత్యాసాలు. మరుగుదొడ్లతో సహా అన్నిటా భారీ కుంభకోణాలు. వ్యవసాయం : వ్యవసాయమే దండగంటూ మొదలై , ఎక్కువగా రైతులకు లబ్ది చేకూర్చే హౌసింగ్ లో దోపిడీ FRDI పై అనుమానాలు సృష్టించి బ్యాంకుల్లోనుంచి డబ్బు బయటకి తీయించి రక్తం తాగే వడ్డీ కామ పిశాచాల ద్వారా రైతు రుణాల్ని పిండటం .. బ్యాంకుల్ని దివాళా తీయించే ప్రయత్నం . రైతులకు దీర్ఘ కాలిక లబ్ది చేకూర్చే భూ ఎక్వజిషన్ చట్టాన్ని వ్యతిరేకించటం . చైనా చెప్పుల కంపెనీలను ఆహ్వానించి దళితుల జీవనాధారం పై దెబ్బ కొట్టిన కమ్యూనిస్టుల తో సాన్నిహిత్యం. తిత్లీ తుఫాను తర్వాత విజయ యాత్రలు, ప్రచార ర్యాలీలు జరిపి ప్రజల కష్టాలతో రాజకీయాలు చేయడం. తెలంగాణా ఎన్నికలు : తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించిన హరికృష్ణ కూతురు , చుండ్రు వారి కోడలికి టికెట్ ఇవ్వటం ద్వారా .. తెలంగాణాలో సెటిలర్స్ కి మిగతా వారి మధ్య చిచ్చు పెట్టడం. భారీగా చందాల సేకరణ. విమానయాన వ్యవస్థ : అశోక్ గజపతి రాజు గారి నిజాయితీని ప్రశ్నించటల్లేదు కానీ .. వారి మంత్రిత్వ హయాంలోనే సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వ విమానం లో విజయ్ మాల్యా పారి పొయ్యాడు .. ఆయన ఎంత వత్తిడికి గురి అయ్యారో తర్వాతి సంఘటనల్ని చూస్తే అర్ధం అవుతుంది .. ఆయనను అసెంబ్లీ కు పోటీ చెయ్యమని పార్టీ అధిష్ఠానం కోరితే ఆయన పడ్డ ఆవేదన మీడియాతో పంచుకొన్నారు. ఎమ్మెల్యే గా మరింత ఊడిగం చెయ్యాల్సొస్తుందని బాధ పడ్డారు. మీడియాతో నాకు పార్లమెంటుకు వెళ్లాలని వుంది అని చెప్పుకొన్నారు ED , సిబిఐ వ్యవస్థ ల ను వ్యతిరేకించటం : వారికింద వున్న వ్యవస్థలను భ్రష్టం చెయ్యటమే కాదు .. తమని ప్రశ్నించే వ్యవస్థలపై ఎదురు దాడికి దిగటం .. కోవర్టులతో నింపటం .. చిదంబరం వంటి వారి ఆదేశాలతో కాంగ్రెస్ తో చెయ్యి కలిపి, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని వీరప్ప మొయిలీ, చిదంబరం పాదాల వద్ద పెట్టటం అంతర్గత భద్రతా వ్యవస్థ : జగన్ పై దాడి , గంటలోపే దాడిచేసిన వ్యక్తి జగన్ అభిమాని అని తేల్చిన వాళ్ళు 20 రోజులైనా రిపోర్ట్ ఇవ్వలేక పోయారు .. అమిత్ షా పై దాడి .. కన్నా పై దాడి , వీర్రాజు గారిపై దాడి .. మరీ మీడియా తప్పించినవి చూపించనివి ఇంకెన్నో మీడియా సమాచార వ్యవస్థ : భజన మీడియా సహకారంతో మీడియా అంటేనే వ్యభిచారుల కంటే నీచం అనే స్థాయికి దిగజార్చి పారేసారు.

ముఖ్యాంశాలు