తగ్గుతున్న పెట్రో ధరలు


దేశీయంగా చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా ఇంధన ధరలు తగ్గాయి. అక్టోబరు 18 నుంచి నవంబరు 23 వరకు పెట్రోల్‌ ధర రూ. 8.43 మేరకు తగ్గడం విశేషం. దేశ రాజధానిలో శుక్రవారం పెట్రోల్‌పై 40 పైసలు తగ్గి లీటర్‌ ధర రూ. 75.57గా ఉంది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 81.50, కోల్‌కతాలో రూ. 77.53, చెన్నైలో రూ. 78.46, హైదరాబాద్‌లో రూ. 80.12గా ఉంది. డీజిల్‌ కూడా నేడు రూ. 41పైసలు తగ్గి దిల్లీలో లీటర్‌ ధర రూ. 70.56గా ఉంది. ముంబయిలో రూ. 73.91, కోల్‌కతాలో రూ. 72.41, చెన్నైలో రూ. 74.55, హైదరాబాద్‌లో రూ. 76.77గా ఉంది.

ముఖ్యాంశాలు