పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్


తిరుపతి - నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ నిజామాబాద్‌ జిల్లా దరిపల్లి మండలం చిన్నాపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం ఉదయం పట్టాలు తప్పింది. ఇంజిన్‌, మరో రెండు బోగీలు పట్టాలు తప్పాయని, అయితే ప్రయాణికులంతా సురక్షితమేనని రైల్వే సిబ్బంది తెలిపారు. ట్రాక్ కు మరమ్మతు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 6 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పలు స్టేషన్లలో రైళ్లను నిలిపివేసినట్లు చెప్పారు. బోధన్‌-మహబూబ్‌నగర్‌ ప్యాసింజగర్‌ను వడ్యారంలో, నిజామా బాద్‌-కాచిగూడ ఫాస్ట్‌ ప్యాసింజర్‌ను మాసాయిపేటలో, మన్మాడ్‌-సికింద్రాబాద్‌ అజంతా ఎక్స్‌ప్రెస్‌ను మనోహరాబాద్‌లో నిలిపివేశారు. ముంబయి-సికింద్రాబాద్‌ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌, నాందేడ్‌-విశాఖ నాగావళి ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ-నాందేడ్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, నాందేడ్‌-సికింద్రాబాద్‌ మన్మాడ్‌ ప్యాసింజర్‌, బోధన్‌-మిర్జాపల్లి, కాచిగూడ-నిజామాబాద్‌ ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు.

ముఖ్యాంశాలు