రాయలసీమ వెనుకబడే ఉంది - సోము

రాయలసీమ ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నదని భారతీయ జనతాపార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సీమ ఎందుకు అభివృద్ధి చెందలేదనే విషయంలో ప్రభుత్వాన్ని ఇక్కడి నేతలు నిలదీయాలని ఆయన పిలుపు నిచ్చారు. శనివారం ఆయన కడపలో విలేకరులతో మాట్లా డారు.  రాయలసీమ ఇప్పటికీ వెనుకబడే ఉందని, తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరిని వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వీర్రాజు అన్నారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. 

Facebook
Twitter