పోలవరం పనులు చూసిన గడ్కరీ దూత


పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓఎస్‌డీ సంజయ్‌ కోలాపుర్కర్‌ శనివారం పరిశీలించారు. విజయవాడ నుంచి కార్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన ప్రాజెక్టు నమూనాను తిలకించారు. అనంతరం కొండపై నుంచి స్పిల్‌వే పనులను పరిశీలించారు. జనవరి మొదటి వారంలో గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వస్తారని, ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులపై ఆయనకు నివేదికను అందజేస్తానని సంజయ్ తెలిపారు. ఓఎస్‌డీ వెంట పోలవరం అథారిటీ సీఈవో సుమిత్ర హల్దార్‌, సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, ఇఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రమేష్‌బాబు ఉన్నారు.

ముఖ్యాంశాలు