ఎలాగైనా నోటీసు పంపాలి


ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నోటీసుల నుంచి తప్పించుకోవడానికి కొందరు తెలివిగా తప్పుడు చిరునామాలు ఇస్తుంటారు. మరికొందరు ఇల్లు మారితే నోటీసులు రావని భ్రమపడుతూ ఉంటారు. అయితే ఇకపై అలాంటి ఆటలు చెల్లవు. తప్పుడు చిరునామా ఇచ్చినప్పటికీ బ్యాంకులు, బీమా సంస్థలు, పోస్టాఫీసుల్లో మీరు ఇచ్చిన కరెక్ట్ చిరునామాల ఆధారంగా ఇంటి అడ్రస్ వెతికి పట్టుకుని మరీ నోటీసులు అందజేయాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఈ నెల 20న సంబంధిత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఆదాయపు పన్ను నుంచి వచ్చే నోటీసులు, సమన్లు గానీ ఇకపై పోస్టులో,

లేదా ఈ-మెయిల్‌ ద్వారా అయినా సరే సంబంధిత వ్యక్తులకు అందుతాయి. సవరణ నోటిఫికేషన్‌ ప్రకారం చిరునామాకు ఒకవేళ సదరు నోటీసు చేరుకోని పక్షంలో 127వ నిబంధన ప్రకారం ఐటీశాఖ , ప్రభుత్వం బ్యాంకులు, బీమా సంస్థలు, పోస్టాఫీసుల్లో సదరు వ్యక్తులు ఇచ్చిన చిరునామాలకు నోటీసులు చేరుస్తారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం