ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్, నవీన్ చర్చలు


తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలూ జాతీయ రాజకీయాలపై చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌కు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మరికొంత మంది జాతీయ నేతలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, మరోసారి సమావేశం అవుతామని అన్నారు. తమ కలయిక దేశానికి మేలు చేస్తుందని స్పష్టం చేశారు. తమది బీ-టీమ్‌ కాదని,ఇది సొంత టీమ్‌ అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. భావసారూప్య పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాత్రి కేసీఆర్ భువనేశ్వర్‌లోని సీఎం అధికారిక నివాసంలో బస చేసారు. 24న ఉదయం కోణార్క్‌ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం