తలాక్ ప్రసంగం.. బూటుతో సన్మానం


ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. దక్షిణ ముంబైలోని నాగ్‌పదలో మంగళవారం రాత్రి ఒక సభలో ఆయన ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆవేశంగా ప్రసంగిస్తూ ఉండాలా గుర్తుతెలియని వ్యక్తి ఒవైసీపై బూటు విసిరాడు. అయితే అది పక్కనే పడింది. ఒవైసీ తన ప్రసంగాన్ని యథాతథంగా కొనసాగించారు. రాత్రి 9.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ప్రజాస్వామిక హక్కుల కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను అని ఆయన అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ను ముస్లింలు అంగీకరించడం లేదన్న వాస్తవాన్ని వీళ్లు గుర్తించలేరు. వీళ్లంతా అసహనపరులు’ అని ఒవైసీ మండిపడ్డారు. తనను తాను ఆయన మహాత్మాగాంధీ, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దభోల్కర్‌లతో పోల్చుకున్నారు. దాడులు నిజాలు మాట్లాడకుండా తనను అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం