ఈ భారత సంతతి వ్యక్తి... అంతర్జాతీయ ఉగ్రవాది


ఐసిస్‌ ఉగ్రవాది సిద్ధార్థ్‌ ధార్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన సిద్ధార్థ్‌ హిందూ మతం నుంచి ఇస్లాంకు మారినవాడు. మతం మారాకా పేరును అబూ రుమైసాగా మార్చుకున్నాడు. సిద్ధార్థ్‌ను ‘న్యూ జిహాదీ జాన్‌’గా పిలుస్తున్నారు. అతడు ఐసిస్‌లో సీనియర్‌ కమాండర్‌. నిహాద్‌ బరకత్‌ అనే యాజిదీ బాలిక తనను యితడు అపహరించి మానవ అక్రమ రవాణా చేశాడని తెలిపినట్లు ఇండిపెండెంట్‌ పత్రిక వెల్లడించింది. సిద్ధార్థ్‌ థార్‌తో పాటు బెల్జియన్‌-మెరాకన్‌ పౌరుడైన అబ్దెలతీఫ్‌ గైనిలను తాజాగా అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. సిద్ధార్థ్‌ 2014లో భార్య పిల్లలతో కలిసి యూకే వదిలి సిరియాకు వెళ్లాడని, ఆ తర్వాత ఐసిస్‌లో చేరాడని అంటున్నారు. ఐసిస్‌లో జిహాదీ జాన్‌గా పిలిచే మొహమ్మద్‌ ఎమ్వాజి స్థానంలో సిద్ధార్థ్‌ను నియమించారు. 2016 జనవరిలో ఐసిస్‌ విడుదల చేసిన వీడియోలో ముసుగుతో కనిపించిన ఉగ్రవాది సిద్ధార్థ్‌ అని అమెరికా అంటున్నది. బ్రిటన్‌ గూఢచారులనే ఆరోపణలతో పలువురు బందీలను హత్య చేసినప్పుడు ఆ వీడియో తీశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం