నాటి నటి కృష్ణకుమారి మృతి


అలనాటి నటి కృష్ణకుమారి కేన్సర్‌తో బాధపడుతూ బెంగళూరులోని తన నివాసంలో బుధవారం ఉదయం మరణించారు. 1933 మార్చి 6న బంగాల్‌లో జన్మించిన కృష్ణకుమారి 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం ద్వారా సినీరంగప్రవేశం చేశారు. పల్లె పడుచు, బంగారు పాప చిత్రాల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించారు. ఏన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి అగ్రనటులతో కలిసి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలన్నింటా దాదాపు 110 చిత్రాల్లో ఆమె నటించారు. ప్రముఖ నటి షావుకారు జానకి ఈమెకు స్వయానా అక్క.

ముఖ్యాంశాలు