వైకాపా.. బిజెపి మీడియా టాక్.. తెదేపా షాక్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో వైకాపా శాసనసభాపక్ష  కార్యాలయంలో... ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో కలిసి భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మీడియా సమావేశం, చర్చలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పీఏసీ సమావే శ వివరాలు వెల్లడించేందుకు వైకాపా శాసనసభాపక్ష కార్యాలయంలో ఒక టీవీ ఛానల్‌తో ఈ సమావేశం జరిగింది. ఇందులో విష్ణుకుమార్ రాజు పాల్గొని చేసిన వ్యాఖ్యలు వివాదా స్పదంగా మారాయి. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపా-భాజపా పొత్తుల అంశంపై ఆసక్తికర చర్చ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలోనే ఇది జరగడం తెదేపా నేతలకు షాక్ ఇచ్చింది. వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగడం దారుణ మని, వారు రాజీనామా చెయ్యాలని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. అలా కానట్లయితే పార్టీ ఫిరాయించి మంత్రులు కావచ్చు అనే కొత్త చట్టం అమల్లోకి తేవాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Facebook
Twitter