గజల్ శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్


లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ బుధవారం రాత్రి బెయిల్‌పై విడుదల అయ్యాడు. తన సంస్థ ఉద్యోగినిపై లైగింక వేధింపులకు పాల్పడిన కేస్‌లో మూడు వారాల కిందట అతడిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకి తరలించారు. ఇవాళ కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయగా రాత్రి జైల్‌ నుంచి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా జైలు వద్ద కలిసిన మీడియాతో శ్రీనివాస్ మాట్లాడుతూ తన కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఏమీ మాట్లాడలేనన్నాడు. తాను నిర్దోషినని చెప్పాడు. అభిమానులకు, మీడియాకి కృతజ్ఞతలు తెలిపాడు.

ముఖ్యాంశాలు