లాలూ పాపాలు అన్నీ ఇన్నీ కాదు!

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులో కూడా దోషిగా తేలారు. ఈ కేసులో లాలూ, జగన్నాథ మిశ్రా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరిద్దరూ దోషులేనని రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఎస్‌.ప్రసాద్‌ తీర్పు చెప్పారు. శిక్ష ఇంకా ఖరారు చేయలేదు. ఇప్పటికే లాలూ దాణా కుంభకోణం రెండో కేసులో మూడున్నరేళ్ల జైలు శిక్షను బిర్సా ముండా కేంద్ర కారాగారంలో అనుభవిస్తున్నారు. మూడో కేసులో ఛాయ్‌బసా ఖజానా నుంచి రూ.36కోట్లు అక్రమంగా పొందినట్లు లాలూ, మిశ్రాపై కేసు ఉంది. లాలూపై మొత్తం ఐదు దాణా కుంభకోణం కేసులు ఉన్నాయి. 2013లో మొదటి కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పడింది. మరో కేసులో ఈనెల 6న లాలూకి మూడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆయనపై ఇంకా దమ్‌కా ఖజానా నుంచి రూ.3.97కోట్లు, దొరాండా ఖజానా ద్వారా రూ.184కోట్లు అక్రమంగా పొందినట్లు కేసులు ఉన్నాయి. వీటి తీర్పులు త్వరలోనే రావచ్చని భావిస్తున్నారు. 

Facebook