సమన్వయం లేని బిజెపి నేతల ప్రకటనలు


కీలకమైన విషయాలపై కూడా ఒక సంయమనం, సమన్వయము లేకుండా బిజెపి ముఖ్య నేతలు చేస్తున్న ప్రకటనలు వ్యాఖ్యలు కేంద్రప్రభుత్వానికి ఇబ్బందులు కల్పిస్తున్నాయి. అమిత్ షా, నితిన్ గడ్కరీలు ఇద్దరూ పెట్రోలు ధరలపై తాజాగా చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే ఇందుకు నిదర్శనం. పెట్రోలియం ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని బీజేపీ చీఫ్ అమిత్ షా రెండు రోజుల కిందటే అన్నారు. ఇంధన ధరల నియంత్రణకు కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పెట్రోలియం మంత్రి, ప్రభుత్వరంగ చమురు సంస్థల ఉన్నతాధికారులతో చర్చిస్తోందనీ, వీలైనంతవరకు ధరలు తగ్గించాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అంటూ నాలుగైదు రోజుల్లో చర్యలు ఉంటాయని అమిత్ షా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దీనికి భిన్నమైన వ్యాఖ్యలు చేసారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇంధన ధరలపై సబ్సిడీ అమలు చేస్తే , ఆ ప్రభావం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాల అమలుపై పడుతుందని పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపు నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి వుందని ఇదొక అనివార్యమైన పరిస్థితిని అనీ గడ‍్కరీ వెల్లడించారు. ఇప్పుడు జనం ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలి? అసలు కేంద్రం ఏమి చేయనుంది?

ముఖ్యాంశాలు