ఇద్దరికీ చెక్ ... సిబిఐ  కొత్త డైరెక్టర్ గా మన్నెం

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు... కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్‌ గా మన్నెం నాగేశ్వరరావు నియమితులయ్యారు. కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఈ ఉత్తర్వులు జారీచేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన మన్నెం ఒడిశా కేడర్‌ అధికారి. ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. డీవోపీటో ఆయనను తక్షణం బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్‌‌.
సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మధ్య మొదలైన ‘వర్గ పోరు‌’పై కేంద్రప్రభుత్