మళ్ళీ ఎగిరిన ఎయిర్ డెక్కన్


చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్‌ డెక్కన్‌ మళ్లీ ఆకాశానికెగిరింది. పెద్ద నగరాలతో చిన్న నగరాలను అనుసంధానం చేసే కమ్యూటర్‌ విమానయాన సంస్థగా తొలి విమాన సర్వీసును ఈ సంస్థ నడిపింది. శనివారం మధ్యాహం ముంబై చత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎయిర్‌డెక్కన్‌ డీఎన్‌ 1320 విమానం జల్‌గావ్‌కు వెళ్లింది. ముంబయి నుంచి జల్‌గావ్‌కు 400 కి.మీలు. ఈ విమాన సర్వీసును మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌, ఎయిర్‌డెక్కన్‌ ఛైర్మన్‌ కెప్టెన్‌ జి.ఆర్‌.గోపీనాధ్‌ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు జల్‌గావ్‌ విమానాశ్రయంలో ఈ విమానానికి వాటార్‌ కెనాన్‌ సంప్రదాయ వందనం లభించింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యూహాత్మక భాగస్వాములు శైశవ్‌ షా (జీఎస్‌ఈసీ లిమిటెడ్‌), హిమాన్షు షా (మోనార్క్‌ నెట్‌వర్త్‌ కేపిటల్‌), డీజీసీఏ ఉన్నతాధికారులు ఈ తొలి విమానంలో ప్రయాణించారు. ఈ సర్వీసుల నిమిత్తం బీచ్‌ క్రాఫ్ట్‌ బి-1900డి విమానాలను ఎయిర్‌డెక్కన్‌ నడుపుతోంది. ఇందులో 18 మంది ప్రయాణికులు, ఒక క్రూ సభ్యుడు ప్రయాణించే వీలుంటుంది. ముంబయి- జల్‌గావ్‌ విమానానికి 50 శాతం సీట్లకు రూ.2,250 ధర కాగా.. మిగిలిన 9 సీట్లకు ఒక్కో సీటుకు రూ.4,500 అని ఓ అధికారి వెల్లడించారు. జల్‌గావ్‌ నుంచి ముంబయికి చేరిన విమానం ఆ తర్వాత నాసిక్‌కు వెళ్లింది. తొలి విడత కార్యకలాపాల్లో భాగంగా ముంబయి, పుణె నుంచి జల్‌గావ్‌, నాbeach craft శిక్‌, కొల్హాపుర్‌లకు ఎయిర్‌డెక్కన్‌ విమానాలను నడపనుంది. చిన్న నగరాల్లో గిరాకీని సృష్టించడమే తమ లక్ష్యమని ఎయిర్‌డెక్కన్‌ అధిపతి జి.ఆర్‌.గోపీనాధ్‌ వెల్లడించారు. పెద్ద సంస్థలతో పోటీపడాలని అనుకోవడం లేదన్నారు. దేశంలో అవకాశమున్న ప్రతి ప్రాంతానికి విమానాలను నడపాలన్నది తన కల అని అయన అన్నారు. ఎయిర్‌డెక్కన్‌ను 2008లో కింగ్‌ఫిషర్‌కు విక్రయించడం వల్ల ఆ కల నెరవేరలేదన్నారు. దేశవ్యాప్తంగా తిరిగి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చిందన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం