కావలి వద్ద లారీని ఢీకొన్న బస్సు .. ముగ్గురి మృతి


విశాఖ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు గురువారం ఉదయం నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దురపాడు సమీపంలో ప్రమాదానికి లోనైంది. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేస్తున్నపుడు ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న సామవేదం సూర్యకుమారి(65) (విశాఖపట్నం), తాడినాడ ప్రణీత్‌(25) (విజయవాడ), రామదాసు(55) (రాజమహేంద్రవరం) అక్కడికక్కడే మృతి చెందారు. కావలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ముఖ్యాంశాలు