కాపు కార్పొరేషన్ ఋణం అందజేత


రాజమహేంద్రవరం అన్నపూర్ణంపేట కు చెందిన భారతీయ జనతా పార్టీ మహిళావెూర్చ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి సత్య కు కాపు కార్పొరేషన్ ద్వారా రూ. 2 లక్షల రుణాన్ని కరూర్ వైశ్యా బ్యాంకు మంజూరు చేసింది. ఈ చెక్కును బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆమెకు అందజేశారు. సోము మాట్లాడు తూ వ్యాపారం చక్కగా అభివృద్ధి చేసుకొని త్వరలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బిజెపి రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, అసెంబ్లీ కన్వీనర్ పైలా సుబ్బారావు, సోషల్ వీూడియా కన్వీనర్ బేతిరెడ్డి ఆదిత్య, మహిళా వెూర్చ ఉపాధ్యక్షురాలు పిల్లి మణెమ్మ, యువవెూర్చ ప్రధాన కార్యదర్శి దోనేపూడి రవి, సతీష్ పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం