పద్మ పురస్కార గ్రహీతలు వీరే


2018 సంవ‌త్స‌రానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వైద్యం, కళలు, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్‌తో గౌరవించింది. అలాగే పలువురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. విద్యారంగంలో మహరాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్‌ గుప్తా, వైద్యరంగంలో కేరళకు చెందిన ఎం.ఆర్‌ రాజగోపాల్‌, లక్ష్మీ కుట్టి, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యేషి ధోడెన్‌, కర్ణాటకకు చెందిన సలగత్తి నరసమ్మ, కళారంగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్‌, మహారాష్ట్రకు చెందిన విజయలక్ష్మీ నవనీత కృష్ణన్‌, సామాజిక సేవా రంగంలో బంగాల్‌కు చెందిన 98 ఏళ్ల సుధాన్షు బిశ్వాస్‌, సుభాషిణి మిస్త్రీ, క్రీడారంగంలో మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్‌ పేట్కర్‌, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రంగంలో తమిళనాడుకు చెందిన రాజగోపాలన్‌ వాసుదేవన్‌ ప్రభృతులను ఈ పుర‌స్కారానికి ఎంపికచేసింది.

ముఖ్యాంశాలు