బ్రూనై సుల్తాన్‌ .. ఆ విమానానికి ఆయనే పైలట్


భారత రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బ్రూనై సుల్తాన్‌ హసనై బొకీ తన జంబో జెట్‌ను తానే నడుపుకొంటూ నేరుగా ఢిల్లీలో ల్యాండవడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన భారత ప్రముఖులు ఆశ్చర్యానికి లోనయ్యారు. 2014లో మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం బ్రూనై సుల్తాన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇతర దక్షిణాసియా దేశాల మాదిరిగా వార్తల్లో ఎప్పుడూ ఉందని బ్రూనై ఈ 71 ఏళ్ల సుల్తాన్‌ చేసిన అద్భుత ఫీట్‌తో వార్తల్లో హైలైట్‌ అయిందని అధికారులు చెప్పుకుంటున్నారు. 2008, 2012లో కూడా హసనై భారత్‌ పర్యటనకు వచ్చారని, అప్పుడూ తన విమానాలకు తానే పైలట్ గా వ్యహరించారని అధికారులు అంటూన్నారు. గత ఏడాది అక్టోబర్‌ 5తో ఆయన అయిదు దశాబ్దాల సుదీర్ఘ అధికార ప్రస్ధానం పూర్తిచేసుకున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం