కాగితం విమానాలతో గిన్నిస్ రికార్డు

దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో శనివారం 47 పాఠశాలలకు చెందిన 7 వేల మంది విద్యార్థులు ఒక చోట చేరి కాగితం విమానాలను ఒక్కసారిగా గాల్లోకి వదిలారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అస్ట్రోనాటిక్స్ అండ్ ఏవియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పేపర్ గ్లైడర్ షో కనువిందు చేసింది. గతంలో పోర్చుగల్‌లో 14 వేల మంది విద్యార్థులతో నిర్వహించిన పేపర్ గ్లైడర్ షో ప్రస్తుతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఉన్నది. దీనిని అధిగమించేందుకు భారతదేశంలో పది కేంద్రాల్లో మొత్తం 40 వేల మంది విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ఇందులో ఒకటని కళాశాల కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పరిశీలకులుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆడిటర్ల బృందంతో పాటు కళాశాల ఛైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.