‘తిత్లీ’ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం

శ్రీకాకుళం జిల్లాలోని ‘తిత్లీ’ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్‌కు చేరుకున్న ఎనిమిది మంది సభ్యుల బృందం.. తుపానుతో అతలాకుతలమైన ప్రాంతాలను ఫోటో ఎగ్జిబిషన్‌ ద్వారా తిలకించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ధనంజయరెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, వజ్రపుకొత్తూరు, పలాస, కవిటి, మెళియాపుట్టి, మందస, సోంపేట, కంచిలి మండలాల్లో బృంద సభ్యులు పర్యటించనున్నారు.

Facebook
Twitter