ముఖ్యాంశాలు

జగన్‌పై అభిమాని కత్తి దాడి


వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో ఒక యువకుడు కత్తి తో దాడి చేసి స్వల్పంగా గాయపరిచాడు. పాదయాత్రలో ఉన్న జగన్ రేపు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు విశాఖ చేరుకొని లాంజ్‌లో కూర్చొన్నారు. అక్కడే ఓ హోటల్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌ ఆయనతో సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందినవాడు. అతడు ఏడాదికాలంగా విశాఖ విమానాశ్రయంలో ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడి పేరు శ్రీనివాస్. నిందితుడు శ్రీనివాస్‌ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్‌ కటౌట్‌ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇప్పుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని పరిస్థితి అని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై దాడి తీవ్ర కలకలం రేపింది. తొలుత విశాఖలోనే ప్రథమ చికిత్స చేయించుకున్నజగన్‌ ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లి సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. దేవుడి దయవల్ల క్షేమంగానే ఉన్నానని, ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను తనను భయపెట్టలేవని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయంటూ ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జగన్‌ చికిత్సపొందుతున్న ఆస్పత్రి వద్దకు అభిమానులు చేరుకొని జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆయన సతీమణి వైఎస్‌ భారతి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధం లేని విషయమని స్పష్టంచేశారు. దీనిపై అల్లర్లకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు.

​సంబంధిత సమాచారం 
తాజా వార్తలు

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us