దేశ, ధర్మ రక్షణకు బిజెపి - స్వామి పరిపూర్ణానంద


ఇవాళ హైదరాబాద్ లో స్వామి పరిపూర్ణానంద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ రంగ ప్రవేశం గురించి, బీజేపీలో చేరడం ఎందుకనే విషయం గురించి తన మనోభావాల్ని ఇలా ఆవిష్కరించారు. ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. "25 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై పోరాడాను. బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో పర్యటించాను. అక్కడ సమభావం లేదని గుర్తించాను. మారుమూల ప్రాంతాల్లో వెళ్లే దారి కూడా లేదు. కేవలం నా ప్రవచనాలతో చైతన్యం తేలేను అనుకున్నాను. అమ్మ అనుగ్రహంతో రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించు కున్నాను. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా నాపై అభిమానం చూపించారు. అనేక విషయాలు చెప్పారు. ఒక రాష్ట్రానికే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా మీ సేవలు కావాలన్నారు. తెలంగాణలో బిజెపి కోసం పాటుపడాలి అని చెప్పారు. నా బహిష్కరణ.. అమిత్ షా ఆవిష్కరణ అయింది. దేశాన్ని రక్షించుకోవాలన్నా.. ధర్మాన్ని పరిరక్షించుకోవాలన్నా బిజెపి రావాలి అనుకున్నా.. బిజెపిలో కులాలు, కుటుంబాలు లేవు.. అవినీతి లేదు.. బంగారు లక్ష్మణ్, నరేంద్ర మోదీ, అబ్దుల కలాం, రాంనాథ్ కోవింద్ లాంటి వారిని దేశానికి అందించింది. అద్వానీ, వాజపేయి జోడి బిజెపిని నడిపించింది.. ఇప్పుడు మరో జోడి.. అమిత్ షా, మోదీ జోడి పెను సంచలనం సృష్టించింది. కురుక్షేత్రంలో ఐదుగురు పాండవుల్లా తెలంగాణలో బిజెపి గెలుస్తుంది.. మిషన్ 70తో బిజెపి అధికారంలోకి వస్తోంది. తెలంగాణలో మిషన్ 70 పూర్తి చేసాక ఇతర ప్రాంతాలకు వెళ్తాను.. ‘‘తెలంగాణలో జనతా సర్కార్ రావాలి.. పరివార సర్కార్ పోవాలి’’ అనేదే నా నినాదం.. పని చేయడానికి వచ్చాను.. పదవి కోసం కాదు.. లక్ష్మన్ ఏ గీత గీసినా పాటిస్తాను.. ఆశ లేదు, ఆశయం మాత్రమే ఉంది.. తెలంగాణ కాషాయ తెలంగాణగా మారబోతోంది."

ముఖ్యాంశాలు