అగ్రిగోల్డ్ స్వాధీన ప్రక్రియపై సంతృప్తి


అగ్రిగోల్డ్ సంస్థను స్వాధీనం చేసుకొనే ప్రక్రియలో ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ పురోగతిని జీ ఎస్సెల్ గ్రూప్ హైకోర్టుకు నివేదించింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ఇందులో వివరించింది. స్వాధీన ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం ఇందులో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కాగా ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియను జీఎస్సెల్ గ్రూప్ తెలిపిన తర్వాత హై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రక్రియ పూర్తికి ఏప్రిల్ వరకు గడువు ఇవ్వాలని జీ ఎస్ ఎల్ కోరింది. కాగా ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 20 వరకు గడువు ఇచ్చి, ఆ రోజున తదుపరి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ముఖ్యాంశాలు