ఉద్వేగంతో కంటతడి పెట్టిన రాష్ట్రపతి


శరీరంలో బుల్లెట్లు దిగినా తలొగ్గకుండా ధైర్యసాహసాలను ప్రదర్శించి కీలకమైన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలకు విజయాన్ని అందించారు కార్పొరల్‌ జ్యోతిప్రకాశ్‌ నిరాలా. వీరమరణం పొందిన ఆయనకు అశోకచక్రను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాజ్‌పథ్‌లో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఆయన తల్లి మాలతీదేవి, భార్య సుష్మనంద్‌లు ఈ పతకాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. ఆ సమయంలో రాష్ట్రపతి ఉద్వేగభరితులయ్యారు. కళ్లజోడు తీసి కన్నీటిని తుడుచుకున్నారు.

ముఖ్యాంశాలు