లారీ, బస్సు ఢీ.. ఐదుగురి మృతి


పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. రాజమహేంద్రవరం నుంచి ఏలూరు వెళుతున్న కొవ్వూరు డిపో ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. తునికి చెందిన గేలం లక్ష్మి(50), కాపుశెట్టి జ్యోతి(37), కాపుశెట్టి అఖిల సత్య(12), కాపుశెట్టి శివసాయి(14), ఒడిశాకు చెందిన పల్లా సావిత్రమ్మ(60) ఈ ప్రమాదంలో మృతి చెందారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం