ఎపి స్టేట్‌ ఫారెస్ట్‌ అకాడమీలో జాతీయ పతాకావిష్కరణ


రాజమహేంద్రవరంలో ఉన్న ఎపి రాష్ట్ర అటవీ అకాడమీ ప్రాంగణంలో జనవరి 26 రిపబ్లిక్‌డే సందర్భంగా శుక్రవారం జాతీయపతాకావిష్కరణ జరిగింది. అకాడమీ సంచాలాకులు, రాజమండ్రి సర్కిల్‌ ముఖ్య అటవీ సంరక్షణాధికారి జెఎస్‌ఎన్‌ మూర్తి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న 59 మంది ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు, సెక్షన్‌ అధికారులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్రాన్ని రాజ్యాంగబద్ధమైన స్వపరిపాలనగా మార్చుకున్న సందర్భమే గణతంత్ర దినోత్స వమన్నారు. నాటి స్వరాజ్యసమరంలో పాల్గొనే అవకాశం ఈ తరానికి లేకపోయినా, ఆ స్వరాజ్యఫలితంగా లభించిన రాజ్యాంగాన్ని అనుసరించే అవకాశం ప్రతిఒక్కరికీ ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, వన్యమృగాల సంరక్షణ అనే గొప్ప బాధ్యతలను నిర్వహించే అటవీశాఖలో ఉద్యోగం చేయడం ఎంతో అదృష్టంగా, గర్వకారణంగా ప్రతిఒక్కరూ భావించాలని అయన ఉద్ఘాటించారు. రాష్ట్ర అటవీ అకాడమీలో వివిధ జిల్లా ట్రెయినీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జాతీయపతాకావిష్కరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. వందేమాతర గీతంతో మొదలైన ఈ కార్యక్రమం జాతీయగీతాలాపనతో ముగిసింది. రాష్ట్ర అటవీ అకాడమీ ఉపసంచాలకులు వైఎస్‌ నాయుడు, ఎంవి ప్రసాదరావు, ఫ్యాకల్టీ సభ్యులు ఎ రామారావు, ఎస్‌వి రమణ, కె రాజేంద్రప్రసాద్‌, పి ఉదయ్‌శంకర్‌, స్టేట్‌ సిల్వికల్చరిస్ట్ శ్రీహరిగోపాల్‌, హవల్దార్‌ ఆదాంరాజు, పిటి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం