పక్షుల కోసం దీపావళికి సెలవు


రసాయనాలతో కూడిన టపాసులను కాల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం ఏర్పడి మానవాళితో పాటు జంతుజాలం కూడా అగచాట్లు పడుతోంది. కొన్ని జంతువులూ, పక్షులు ఈ కాలుష్యం కారణంగా అంత రించిపోయే దశకి చేరుకున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని తమిళనాడు లోని శివగంగ జిల్లావాసులు కొన్ని సంవత్సరాలుగా దీపావళి జరుపుకోవ డమే మానేశారట. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడం మానేసి, నిశ్శబ్ద దీపావళిని జరుపుకొంటూ అక్కడికి వచ్చే వలస పక్షులను సంరక్షిస్తున్నారట. తమిళనాడు శివగంగ జిల్లాలోని కొల్లుకుడిపట్టి, సింగాంపునారి ప్రాంతాలకు ఉత్తర భారతదేశం, సైబీరియా, న్యూజిలాండ్‌ నుంచి అక్టోబరు-నవంబరు మాసాల్లో కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయి. వీటిలో కొంగలు, చెరువు కాకులు వంటి వివిధ రకాలు పక్షులున్నాయి. ఇవి మార్చి వరకూ ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు అయ్యేంత వరకూ ఉంటాయి. ఈ క్రమంలో టపాసుల కారణంగా ఆ పక్షుల జీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుం డా ఆ ప్రాంతవాసులు నిశ్శబ్ద దీపావళి జరుపుకొంటున్నారు. చిన్నారులు కూడా వలస పక్షుల సంరక్షణ దృష్ట్యా తమ నివాస ప్రదేశాల నుంచి దూరంగా రెండు కిలోమీటర్ల వరకూ వెళ్లి మరీ టపాసులు కాలుస్తారట. మరోవైపు కోయంబత్తూరులోని కిట్టంపలాయం అనే మరో ప్రాంతంలో పురాతన కాలం నాటి ఓ చింతచెట్టు ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల కొద్ది గబ్బిలాలు అక్కడికి వలస వస్తుంటాయి. వాటికి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ ప్రాంతవాసులు టపాసులు కాల్చడమే మానేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం